శర్మ దంతుర్తి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;శర్మ దంతుర్తి

ఇంతకీ చిలకలకి సరసా అనేమాట నేర్పింది ఎవరు? శివా!
అర్చకస్వామేనా? శివా!
అర్చకస్వామి దూరమైపోయినందుకు సరసేనా అలా నేర్పింది? శివా!
ఎందుకు అర్చకస్వామి ఉద్యోగం ఊడింది? శివా!
జయమోహన్ కధ – శివా!
భాస్కర్ అనువాదం – శివా! శివ శివా! 🙂


03 May 2024 7:48 PM

ఈమాట;శర్మ దంతుర్తి

మేడా, మిద్దె కాక హాస్టల్ రూముల్లో, స్నేహితుల అపార్ట్‌మెంట్లలో, చెరువు గట్లమీదా కూడా మేము చేసేవారం ఈ కంబైన్డ్ స్టడీ. మిడ్‌టెర్మ్‌కి ఫలానా రూమ్‌లో చదివితే మంచి గ్రేడ్ వచ్చింది కనక మిగతా ఏడాది, సెమెస్టర్ అంతా ఫలానా రూమే. టీలూ, భోయనాలు అన్నీ మిగతావి మీరు చెప్పినట్టే, చదువుమీద తప్ప మిగతా అన్నింటిమీదే శ్రద్ధ. ఫలానా టీచర్ దరిద్రుడురా, మనం ఏం చదివి ఏం రాసినా మార్కులేయడు; ఇప్పుడు చదివి ఏం ప్రయోజనం అనే వేదాంతం కూడా ఇక్కడే వంటబట్టేది. ఆశ్చర్యంగా ఆ ఫలానా టీచర్, ప్రొఫెసర్ ఎంత కష్టపడి చదివి రాసినా మంచి మార్కులేసేవాడు కాదు – అనుకున్నట్టే. డిగ్రీలన్నీ అయ్యాక ఆ ప్రొఫెసర్లనీ టీచర్లనీ మర్చిపోయేం కానీ గత స్మృతులు బాగానే గుర్తున్నై. అయితే ఆ స్నేహితులూ రూమ్మేట్లూ ఇప్పుడెక్కడున్నారో ఒకరికొకరికి తెలియదు.


03 May 2024 7:41 PM

ఈమాట;శర్మ దంతుర్తి

అంత్యశయ్య మీద… నిప్పు రాజుకునే ముందు

అక్షర సత్యాలు చెప్పారు. అద్భుతం. నిజంగా నోరు విప్పకపోతే చివరకి జరిగేది ఇదే.

హై టెక్ అనుకుంటూ మనం తవ్వుకున్న గొయ్యే ఇది. మొదట్లో ఉత్తరం వస్తే – కార్డు ముక్క అయినా – ఎంతో సంతోషం. తర్వత ఫోన్ మోగితే సంతోషం మనలని ఎవరో పలకరిస్తున్నారని. ఆ కాల్ రాంగ్ నెంబర్ అయినా (ఒరే చిట్టిగా బావున్నావా? … సారీ ఇది లారీ సప్లై ఆఫీసండి) అదో నవ్వుకునే ఆనందం. ఇప్పుడవన్నీ పోయి స్నేహం ఫేసుబుక్కు మీదా, ఎన్ని లైకులొచ్చాయ్, ఎవడు కొట్టాడు లైకు, వాట్సాప్ లో సంతోషం వెతుక్కునే జీవితం రావడానిక్కారణం; ప్రతీ కుర్రాడూ కుర్రమ్మా ఫోన్ మీద వీడియోలూ అవీ చూసుకోవడానికీ కారణం మన స్టీవ్ జాబ్స్ బాబే. ఫోన్ మోగితే ఎత్తరు కానీ ఎస్సెమ్మెస్ మెసేజ్ వస్తే చంకలు గుద్దుకుంటూ అది మరో పది మందికి ‘స్ట్రైట్ ఫార్వార్డ్’ చేసేయడమే; అది నిజమా కాదా అనేది ఎవరికీ పట్టదు. ఆశ్చర్యంగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారిక్కూడా ఈ ఫేసుబుక్కు జ్వరం గొరిల్లా గ్లూలా అంటుకుని ఎంతకీ వదలడం లేదు.

చేతులు పట్టుకుని పక్కపక్కనే కూర్చుని ఒక మాయాబజార్ లాంటి సినిమా చూసి, రోజువారి పడే తిప్పలు మర్చిపోయి, మనసు విప్పి మాట్లాడుకునే రోజులేవీ? మనుషులున్నారు నిజమే, కానీ ఎవరికీ నోరు పెగలదు. అర్ధాంగినో, కొడుకునో, కూతుర్నో చూసి ‘ఐ లవ్ యూ’ అనే రోజులు లేవు. మొహం ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడలేక, వాట్సాఫ్ లో చెప్పుకోవడమో లేదా ఫేసుబుక్కులో లైకులు కొట్టడమో. పక్క గదిలో కుర్రాడు ఈ గదిలో తమ్ముడితో మాట్లాడ్డు – మెసేజ్ పంపుకోవడమే. ఫోను కూడా కమ్యూనికేషన్ కి కాదు ఇప్పుడు. వీడియోలకి ఆటలకీ ఎస్సెమ్మెస్ లకీ అంతే. దేనికైనా సరే ఒకే ఒక ఆయుధం – గూగిల్ కరో భాయీ!

మనుషులు మాట్లాడుతున్నప్పుడు వినకపోయినా, వాళ్ళు చెప్పినది అక్కర్లేదనుకున్నా, తర్వాతెప్పుడో కావాలనుకున్నప్పుడు మాట్లాడ్డానికి ఆ మనుషులు ఉండరు. ఈ కవితలో ఇది సరిగ్గా ప్రతిబంబించారు


02 May 2024 5:39 PM

ఈమాట;శర్మ దంతుర్తి

ఆఖరి ఆటవెలదితో కవులమని చెప్పుకునేవారి మీదా కవిత్వం రాసే వారి నడ్డి మీదా కొరడా ఝుళిపించారు ఆచార్యులవారు. కనీసం ఇప్పటినుంచైనా మంచి కవిత్వం వస్తుందని ఓ ఆశ.


01 May 2024 6:47 PM

ఈమాట;శర్మ దంతుర్తి

కిరణ్ గారు
మీ పరిశోధన పేరులో “వస్తురూప వివేచన” అంటే ఏమిటి? దయచేసి కిందన ఇచ్చిన కృష్ణ మోహన రావుగారి రుబాయీకి వస్తురూప వివేచన చేసి వివరించగలరా?

(6) ప్రేమమ్మన జీవితమ్ము – ప్రేమించుటయే
ప్రేమమ్మన జీవితమ్ము – క్రీడించుటయే
ప్రేమమ్మొక రోజు కాదు – త్రేతాయుగమే
ప్రేమమ్మన నీవు నేను – రెండొక్కటియే

ఇందులో త్రేతాయుగం బదులు “సత్య యుగమే,” “ద్వాపర యుగమే,” “కలియుగమే,” మహాయుగమే,” అని మారిస్తే రుబాయీలో తేడా ఉంటుందా? లేదా ఆఖరి లైను “ప్రేమమ్మన మనిద్దరమొకటే’ అని రాస్తే అది రైటా తప్పా?

నాకు రుబాయీ అంటే తెలియదు కనక, తెలుగు అంత రాదు కనక అడుగుతున్నాను.

ధన్యవాదములు.


23 April 2024 9:50 PM